తెలుగు భాష, శ్రీకృష్ణదేవరాయలు – ఒకరికి ఒకరు మక్కువ. తెలుగు వాడిగా నా గర్వం రాయలవారికి ఇష్టమైన భాష అనియే. అయితే ఆయన అలా అనకపోయినా – నాకు తెలుగంటే అంటే అంత ఇష్టం ఉండేది – అది ఆ భాష గొప్పదనం. ఎవరికైనా వారి మాతృభాష అంతే (ofcourse , ఆ భాష పరిచయం ఉంటేనే). అలాంటి మక్కువ ఉన్న ఈ తెలుగు భాషలో ఏంతో పద్య గద్య గ్రంథ సంపత్తి ఉంది, దానిని చదువుకుని నా ఉనికిని, నా సంస్కృతిని మరింతగా తెలుసుకొని, మనిషిగా ఎదిగి – ఆధ్యాత్మికంగా కైవల్యాన్ని సంపాదించుకోవచ్ఛు. విద్యార్థిగా ఆ విషయాలకు కొంత పరిచయం కలిగింది కానీ ముందుకి సాగలేదు. కడుపుకోసం కూటి విద్యలు అభ్యసించి కొంతవరకు జీవితాన్ని సాధించామని ఆలోచన చేస్తే – అయ్యో తెలుగు వదిలేసానని బెంగ. ఉన్న, దొరికిన కొంత కాలం ఈ భాషని ఉపయోగించుకొని ఎదగాలని ఆకాంక్ష.
రాయలు వారు రచించిన ఆముక్తమాల్యద గురించి తెలుసుకోవాలని గరికిపాటి వారి ప్రవచనం విని ఇది వ్రాస్తున్నాను.
ఆముక్తమాల్యద అంటే “ఒకరు వాడిన/పెట్టుకొనిన మాల మారు ధరించడం”. ఇది రంగనాధ స్వామివారి కోరిక. గోదాదేవి అనే తన భక్తురాలు కొప్పులో ధరించి విడిచిన పూలదండనే తనకి సింగారించమని తన భక్తుడైన విష్ణుచిన్తన్ కు ఆదేశించాడు. చివరకు గోదాదేవి శ్రీరంగనాధుడి కళ్యాణ సన్నివేశంతో గ్రంధసమాప్తి అవుతుంది. అయితే ఈ కావ్యం లో ఏంతో రసభరితమైన కావ్య భాష ఉండదంతో – దానిని ఆశ్వాసించడానికి గురు సమానులైన గరికిపాటి వారి సహాయం ఎంతైనా అవసరం. ఆ కాల పద్ధతులు, సంస్కృతి, ఆచారాలకి దర్పణం ఆ గ్రంధం. గోదాదేవి యొక్క విరహ గానం తో ప్రకృతిని అందంగా కొనియాడింది ఈ ఆముక్త మాల్యద. 3 గం సాగిన వారి ప్రవచనం ఈ అద్భుత గ్రంధానికి పరిచయం తప్ప – వివరం కాదు. మరింత సమయంతో ఎప్పుడైనా ఇంకొంత నేర్చుకుంటానని తలుస్తూ … ఉంటాను మరి.
స్వామి
